Type Here to Get Search Results !

TET CHILD DEVELOPMENT AND PEDAGOGY MCQ TEST SERIES NO-8| Practice Questions & Answers

DSC/TET Child Development and Pedagogy MCQ Test-11 | Practice Questions & Answers

How to Attempt the MCQ Test

  • Choose one option from the given 4 alternative options.
  • Your chosen option will appear in grey color.
  • After attempting all the questions, click the Submit button.
  • Correct answers will be shown in green color.
  • Wrong answers will be shown in red color.
  • Your score will be displayed after submission.
  • Every correct answer gives 1 mark.
  • Every wrong answer deducts 1/4 mark from your total score.
1/24
నూతన పాఠ్యాంశాన్ని బోధించే ఉపాధ్యాయుడు విద్యార్థికి గతంలో తెలిసిన విషయాలను గుర్తింపచేసి, తరువాత పాఠ్యాంశం చెప్పడం వికాసపరంగా...?
A)వికాసం రెండు నిర్దేశిక పోకడలను అనుసరిస్తుంది.
B)వికాసం ఏకీకృత మొత్తంగా జరుగుతుంది.
C)వికాసం వైయుక్తిక భేదాలను చూపుతుంది.
D)వికాసం సరళతర అంశాల నుండి క్లిష్టతర అంశాలకు జరుగును.
2/24
ఉపాధ్యాయుడిచే మందలించబడ్డ అనిల్ అనే విద్యార్ధి ఆ బాధను మర్చిపోవుటకు క్రీడలో నిమగ్నమైనాడు. ఈ లక్షణాన్ని ఈ పేరుతో పిలుస్తారు.
A)ఉద్వేగ కెథార్సిస్
B)ప్రతిగమనం
C)ప్రక్షేపం
D)ఉద్వేగ ప్రకటన
3/24
స్వాతి అను విద్యార్ధిని తన ఉద్వేగాలయిన కోపం, భయాలను ప్రకటించడంలో స్వీయ క్రమ బద్ధతను కలిగి ఉన్నది అయిన స్వాతి అను విద్యార్ధిని ఈ దశకు చెందినదిగా గుర్తించవచ్చును.
A)శైశవ దశ
B)పూర్వ బాల్యదశ
C)ఉత్తర బాల్యదశ
D)నవజాత శిశువు
4/24
సరైన జత ఏది?
A)శాశ్వత దంతాలు పూర్వ బాల్యం
B)నార్సిజం- శైశవం
C)ఉద్వేగ అస్థిరత - కౌమారం
D) పైవన్నీ
5/24
3వ తరగతికి చెందిన ఒక విద్యార్థి కుటుంబ సభ్యులతోను పాఠశాలలోని సహ విద్యార్థులతోను కలిసి మెలిసి తిరుగుతూ, చిన్న చిన్న పనుల యందు సహకారం కనబరుస్తుంటే ఈ విద్యార్థిలో ఈ కౌశలము అభివృద్ధి చెందినట్లు గుర్తించాలి.
A)పాఠశాల కౌశలాలు
B)ఉద్వేగ కౌశలాలు
C)సముదాయ కౌశలాలు
D)సాంఘిక కౌశలాలు
6/24
ప్రీస్కూల్, ఎలిమెంటరీ స్థాయిలలో విద్యా బోధనపై ప్రభావం చూపిన పియాజే సూత్రం.
A)ఆవిష్కరణ, అభ్యసనం
B)అభ్యసన పట్ల పిల్లలు సంసిద్ధత గురించి
C)వైయుక్తిక భేదాలను గుర్తించండి
D) పైవన్నీ
7/24
అల్లరి చేస్తే ఉపాధ్యాయుడు దండిస్తాడని తెలిసి అప్పటి నుంచి అల్లరి చేయడం మానివేసిన శిశువు కోల్బర్గ్ ఏ స్థాయిలో ఉన్నట్లు.
A)సాంప్రదాయస్థాయి
B)పూర్వ సాంప్రదాయ స్థాయి
C)ఉత్తరసాంప్రదాయ స్థాయి
D)పూర్వ ప్రచాలక దశ
8/24
పియాజే ప్రకారం ఆపరేషన్స్ అనగా.
A)సమన్వయ రాహిత్యచర్యలు -సమన్వయ రహిత చర్యలుగా మారడం
B)జ్ఞానేంద్రియాల ద్వారా సాధించిన జ్ఞానాన్ని చాలక క్రియ ద్వారా సమన్వయపరచడం
C)కృత్యాలు చేయగలిగే మానసిక సామర్ధ్యాలు
D)ప్రతిక్రియ జీవి నుంచి పర్యాలోచన జీవిగా పరావర్తనం చెందడం
9/24
కోల్ బర్గ్ ప్రకారం సంప్రదాయ స్థాయికి సంబంధించి సరికానిది.
A)సాంఘిక నియమాలకు కట్టుబడి ఉంటారు
B)ఇతరుల ప్రతిస్పందనలు ఆధారంగా మంచి చెడులను గుర్తిస్తారు
C)అంతరాత్మ ప్రభోధానుసారం నడుచుకుంటారు.
D)చట్టం, ధర్మం ప్రకారం నడుచుకుంటారు
10/24
The language of Intelligence.The psychology of the child గ్రంథకర్త ఎవరు?
A)నోమ్ ఛోమ్ స్కీ
B)కార్ల్ రోజర్స్
C)కోల్ బర్గ్
D)జీన్ పియాజే
11/24
శిశువు తన పాఠశాలకు రోజు ఒక దారిలో వెళ్తాడు. కాని తండ్రి దగ్గర దారిలో ఒక రోజు తీసుకువెళ్ళాడు. అయితే వచ్చేటప్పుడు మళ్ళీ తన పాత దారినే అనుసరించాడు. ఎందుకంటే తను ఒకే విధంగా మాత్రమే గుర్తుకు పెట్టుకున్నాడు. ఇది ఏ భావన
A)ద్విమితిభావన
B) ఏకమితి భావన ఆలోచన
C)కన్జర్వేషన్
D)స్వీయకేంద్రీకృతం
12/24
పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి నూతన గృహ నిర్మాణము చేపట్టు వారు తమ గృహ ఆవరణలో రెండు మొక్కలను నాటినట్లయితేనే అనుమతి నివ్వాలనే విధంగా నియమాలను మార్చడానికి ప్రయత్నించడం గల నైతిక వికాస దశ.
A) మంచి బాలుడు- మంచి బాలికల నీతి
B)అధికారం- సాంఘిక క్రమాన్ని పాటించడం
C) ఒప్పందాలు- వ్యక్తిగత హక్కులు చట్టబద్ధంగా అంగీకరించిన నీతి
D)వ్యక్తిగత సూత్రాలు- అంతరాత్మదశ
13/24
ప్రజ్ఞ యొక్క లక్షణం కానిది.
A) గ్రాహ్యశక్తి
B)సర్దుబాటు చేసుకొను ప్రక్రియ
C) ప్రకృతి నియమాలు గ్రహించుట
D)వృత్తులు నైపుణ్యంతో చేయుట
14/24
ఉపాధ్యాయుడు కల్పించిన ఒక గణిత సమస్యకు 'హాసిని' ఒకే ఒక్క పరిష్కారాన్ని సూచించగా, ఆదర్శ్ అనేక పరిష్కారాలు సూచించాడు. ఈ విద్యార్థులలో మనోవైజ్ఞానిక అంశాలు వరుసగా.
A) అభిరుచి ,వైఖరి
B)సహజసామర్థ్యం, ప్రజ్ఞ
C)ప్రజ్ఞ ,సృజనాత్మకత
D)వైఖరి ,సహజసామర్థ్యం
15/24
అభిరుచులు, వైఖరులకు సంబంధించి సరికాని వాక్యమేది?
A)స్థిరంగా ఉండకుండా పరిస్థితికి అనుకూలంగా మారతాయి
B)ఇవి ప్రతి వ్యక్తికి పుట్టుకతోనే కల్పించి ఉంటాయి
C)వీటిపై పరిసర ప్రభావం ఉంటుంది
D)పైవన్నీ సరైనవి కావు
16/24
క్రింది వానిలో అభిరుచికి సంబంధించి సరికానిది.
A)అభిరుచులు కోరికలతో ఉత్సుకతతో ముడిపడి ఉంటాయి.
B)చేసే పనిలో అభిరుచి ఉంటే అలసట ఉండదు.
C)ఒకే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అభిరుచులు ఒకేలా ఉంటాయి
D)అభిరుచులు మారుతూ ఉంటాయి
17/24
వైయుక్తిక భేదాలను సంతృప్తి పరచుటలో ఒక ఉపాధ్యాయుని పాత్ర ఏ విధంగా ఉండాలి ?
A)పిల్లల సహజ సామర్ధ్యాలు అభిరుచులు మరియు వైఖరులు తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
B)పిల్లల అవసరాలకు అనుగుణంగా పాఠ్యప్రణాళికను సరిదిద్దాలి
C)A & B
D)ఏదీకాదు
18/24
టీచర్ ఉద్యోగ కోచింగ్ కు ప్రతిరోజు ఉదయాన్నే లేచి బయలు దేరే భవాని అలా 6 నెలలు శిక్షణ తీసుకొని పూర్తి చేసుకున్నది. పూర్తయిన కొన్ని రోజులు తర్వాత అనుకోకుండా ఒక రోజు మళ్ళీ ఉదయాన్నే యధావిధిగా కోచింగ్ కు అని బయలు దేరింది. ఈ భావనలో దాగి ఉన్నది?
A)విలుప్తీకరణము
B)తొలగింపు
C)ఉద్దీపన విచక్షణ
D) అయత్నసిద్ధస్వాస్థ్యం
19/24
అనుపయోగం వలన జరిగే విస్మృతిని నిర్మూలించుటకు తోడ్పడే ఉపగమము?
A)అవరోధం మరియు దమనం
B)గుర్తింపు మరియు కన్సాలిడేషన్
C)అమ్నేషియా మరియు ఫ్యూగ్
D)పునఃస్మరణం మరియు పునరభ్యసన
20/24
ఒక విద్యార్థి తరగతి గదిలో తన ఉపాధ్యాయుని వలన దండించబడ్డాడు. ఆ విద్యార్థి తన తప్పు లేకపోయినప్పటికి దండింపబడ్డానని బాధపడి, ఆ బాధను ప్రయత్న పూర్వకంగా మరచిపోయే ప్రయత్నం చేయడం?
A)అనుపయోగం
B)జోక్య ప్రభావం
C)దమనం
D)అపసామాన్యవిస్మృతి
21/24
ఒక బాలుడు ఆంగ్ల భాషను అభ్యసించిన తర్వాత సంస్కృత భాషను అభ్యసించాడు. ఈ అభ్యసన ప్రక్రియలో జరిగిన అభ్యసన బదలాయింపు ఏది?
A)ప్రతికూల బదలాయింపు
B)అనుకూల బదలాయింపు
C)శూన్యబదలాయింపు
D)ద్విపార్శ్వ బదలాయింపు
22/24
కౌమార దశలోని పిల్లలకు వారిలో కలిగే శారీరక ఉద్వేగభరిత మార్పులకు అనుగుణంగా వారికి ఏర్పరిచే లైంగిక విద్య ఉద్దేశం.
A)వారిలో వారికి తెలియకుండా ఏర్పడే మానసిక సంఘర్షణలను ఎలా ఎదుర్కొవాలో తెల్పడం
B)హార్మోనుల ప్రభావంతో ఏర్పడే మార్పుల వలన వారిలో కలిగే మానసిక అలజడుల నుంచి మేలుకొల్పడం
C)సక్రమంగా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం
D)పైవన్నీ ఉద్దేశ్యాలే
23/24
వికాసానికి సంబంధించి సరైన ప్రవచనం.
A)వికాస వేగం అందరికీ ఒకేలా ఉంటుంది.
B)కేవలం పాఠశాలలో అభ్యసన వలనే వికాసం జరుగుతుంది.
C)వికాసం అనేది కేవలం బాల్య దశలోనే జరుగుతుంది.
D) వికాసం బహుమితీయమైనది.
24/24
వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు అనే నియమంకి సంబంధించి సరికాని ప్రవచనం.
A)ప్రస్తుత వికాస వేగ లక్షణాలను బట్టి భవిష్యత్ను అంచనా వేయటం
B)ఒక దశలోని వికాస లక్షణాలను బట్టి రాబోయే వికాస దశలోని లక్షణాలను ముందుగానే ఊహించుట
C)శిశువు ప్రస్తుతం ఆధారంగా అతడు ఎంత వృద్ధి చెందుతాడో అంచనా వేయడం
D) వికాసం క్రమపద్ధతిలో కొనసాగినప్పటికీ దాని వేగంలో విభిన్నత ఉంటుంది.
TET Child Development and Pedagogy MCQ Test 7 TET Child Development and Pedagogy MCQ Test 6
TET Child Development and Pedagogy MCQ Test 5
TET Child Development and Pedagogy MCQ Test 4
TET Child Development and Pedagogy MCQ Test 3
TET Child Development and Pedagogy MCQ Test 2
TET Child Development and Pedagogy MCQ Test 1
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Ads Section