ఆగష్టు 14న టీఎస్ ఆర్జేసీ సెట్ -2021
తెలంగాణ రేషిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ -2021
తెలంగాణ రేషిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ -2021 కోసం గురుకుల విద్యాలయాల సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది. ఆగష్టు 14న జరగనున్న ఈ ప్రవేశపరీక్ష కోసం హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న మొత్తం 35 జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఆర్జేసీ సెట్ నిర్వహిస్తారు.
పరీక్షా కేంద్రాలు :
హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి
పరీక్షా తేదీ : ఆగష్టు 14,2021
పరీక్షా సమయం :
ఉదయం 10 నుంచి 12:30 గంటల మధ్య పరీక్ష జరగనుంది.
ప్రవేశపరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆగష్టు 9 నుంచి అధికారిక వెబ్‌సైట్ http://tsrjdc.cgg.gov.in నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి.